DSP Avanigadda: సింగిల్ నెంబర్ లాటరీ నిర్వహిస్తే కఠిన చర్యలు అవనిగడ్డ D.S.P శ్రీవిద్య
సింగిల్ నెంబర్ లాటరీ జూదం నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ D.S.P టి విద్య శ్రీ స్పష్టం చేశారు.
చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలు వివరించారు.
శ్రీ కృష్ణా జిల్లా SP శ్రీ R.గంగాధర్ IPS, గారి ఉత్తర్వుల మేరకు, అవనిగడ్డ DSP కుమారి. T.విద్యశ్రీ APPS గారి పర్యవేక్షణలో,
చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. ఈశ్వరరావు గారి ఆద్వర్యంలో
ది.20.04.2025 వ తేదీన ఉదయం 10.30 గంటలకు చల్లపల్లి గ్రామ శివారు మోపిదేవి రోడ్డు నందు ఉన్న బళ్లా సుబ్బ నాగన్న ఆశ్రమం వద్ద చల్లపల్లి SI PSV. సుబ్రమణ్యం గారు
తన సిబ్బందితో మరియు స్పెషల్ టీంతో చల్లపల్లి ఏరియాలో సింగిల్ నెంబర్ లాటరీ ఆట నిర్వహిస్తున్న
1. పసుపులేటి లీలా ప్రసాద్
2. మహమ్మద్ మస్తాన్ @ చినబాబు
3. ముచ్చు రామ సుబ్బారావు
4. పఠాన్ ఫరీద్ బాబా
5. మెండు వీరబాబు
6. కుంభా నాగమల్లేశ్వరరావు@చమురు అను వారిని
అదుపులోకి తీసుకోవడమైనది.
వారంతా కొంత కాలంగా ఆర్గనైజర్ లుగా వ్యవహరిస్తూ ప్రజల వద్ద నుండీ డబ్బులు వసూలు చేయడానికి కొంత మందిని నియమించుకుని...
చల్లపల్లి మరియు పరిసర ప్రాంతాలలో చిరు వ్యాపారస్తులు మరియు కూలి పని చేసే వాళ్ళు, స్టూడెంట్స్ వంటి వాళ్ళకు
చిన్న మొత్తానికి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపి
ఒక అంకె పై 100 రూపాయలు పందెం వేస్తే 6000 వరకూ ఇస్తామని అంటే రూపాయికి 60 రేట్లు ఇస్తామని ఆశ చూపి ప్రజల వద్ద నుండీ డబ్బులు వసూలు చేస్తూ వారిని
మోసం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే నిషేదించబడిన లాటరీ ని నిర్వహిస్తునారు.
విచారణ అనంతరం మొత్తం 19 మందిపై Cr.No 148/2025 U/s 111 (2) (b), 3(5) BNS & Sec. 7 of AP Lotteries Act సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి...
వారి వద్ద నుండీ 2 ఫోన్లు, 7,900/- క్యాష్, 5 లాటరీ పేపర్లను సీజ్ చేసి అదుపులోకి తీసుకుని పై 6 గురిపై గతంలో సింగిల్ నెంబర్ లాటరీ కేసులతో పాటు..
క్రిమినల్ కేసులు ఉన్నందున ఈ 6 గురిని ఈరోజు మొవ్వ కోర్ట్ కు రిమాండ్ నిమిత్తం పంపుతున్నాము అని తెలిపారు. మిగతా వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాము అన్నారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నది. ఇకపై చల్లపల్లి పరిసర ప్రాంతాలలో సింగిల్ నెంబర్ లాటరీ జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని అవసరమైతే ఆర్గనైజర్ లపై PD యాక్ట్ నమోదు చేసి నగర బహిష్కరణ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.