Pocso: విజయనగరం మరణించేంత వరకు జీవిత ఖైదు. విజయనగరం జిల్లా SP శ్రీ వకుల్ జిందల్.

విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు తూర్పుగోదావరి జిల్లా

ఏలేశ్వరం పట్టణం చైతన్య నగర్కు చెందిన నాలం శివకుమార్ (29సం.లు) కు

పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే. నాగమణి గారు సహజ మరణం పొందేంత వరకు జీవిత ఖైదు మరియు రూ.13,000/-లు జరిమానా విధిస్తూ 


ఏప్రిల్ 28న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఏప్రిల్ 28న తెలిపారు.

వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణంలో నివాసం ఉంటున్న 16 సంవత్సరాల బాలికకు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పట్టణం, చైతన్యనగర్కు చెందిన 

నిందితుడు నాలం శివకుమార్ (29 సం.లు)తో టైపు నేర్చుకొనే సమయంలో పరిచయం ఏర్పడిందని,

నిందితుడు విజయనగరం పట్టణంలో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నట్లుగా చెప్పి ఆమెతో పరిచయం ఏర్పరుచుకొని,

వెంట పడుతూ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసి, అత్యాచారంకు పాల్పడి, గర్భవతి చేసినట్లు, తరువాత బాబు పుట్టినట్లు, 

నిందితుడు పెండ్లికి నిరాకరించడం, కులం పేరుతో ధూషించడంతో విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా,

అప్పటి 1వ పట్టణ ఇన్స్పెక్టరు జె.మురళి పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు.

అనంతరం ఈ కేసును అప్పటి దిశా మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్ దర్యాప్తు చేసి,

నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా 1వ పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరు ఎన్. శ్రీనివాస్ చర్యలు చేపట్టగా,

నిందితుడు నాలం శివకుమార్ (29సం||లు) మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడి, గర్భవతిని చేసినట్లుగా నేరం రుజువు కావడంతో

విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె. నాగమణి గారు నిందితుడికి సహజ మరణం పొందేంత వరకు జీవిత కాలం 

కఠిన కారాగారం, రూ.13,000/- ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్ తెలిపారు.


ఈ కేసులో బాధితురాలికి రూ.2 లక్షలను పరిహారంగా ఇవ్వాలని పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు.

ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసు వారి తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్టా ఖజానారావు వాదనలు వినిపించగా, 

1వ పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరు ఎస్.శ్రీనివాస్ పర్యవేక్షణలో కోర్టు ఎఎస్ఐ ఐ పి.శ్రీనివాసరావు,
సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులు సిహెచ్, రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరు పరిచారు. 

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసు వారి తరుపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్నెట్టా ఖజానారావు మరియు ఇతర అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ (I.P.S) గారు అభినందించారు.