ప్రతి ఫిర్యాదుదారుని పట్ల సహానుభూతి ప్రదర్శించాలి-- కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు (I.P.S)
మీకోసం కార్యక్రమం లో వారి సమస్యను గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చే ఫిర్యాదు దారుని పట్ల ప్రతి పోలీస్ అధికారి సహానుభూతి ప్రదర్శిస్తూ, ఆ ఫిర్యాదును ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచిస్తే ప్రతి ఫిర్యాదారునికి న్యాయం అందించగలమని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్., గారు అన్నారు.
28-4-2025 సోమవారం జరిగిన స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు ఫిర్యాదుదారుల వద్ద నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రతి వారి యొక్క సమస్యను విని, ఆ ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.
వయసు మళ్ళిన వృద్ధులకు, నడవలేని స్థితిలో ఉన్నవారికి సహాయకారిగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
మీకోసం ద్వారా వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి పరిష్కారం అందించే దిశగా ప్రతి పోలీసు అధికారి కృషి చేయాలని తెలిపారు.