5 Years Prison: 85 సం.రాల వృద్దురాలిపై అత్యాచార యత్నం.

85 సం.రాల వృద్దురాలిపై అత్యాచార యత్నానికి 
పాల్పడిన ముద్దాయికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, 
రూ.5000/- జరిమానా.

కేవలం 15 నెలల్లోనే నిందితుడికి శిక్షపడుటలో విశేష కృషి చేసిన గుంటూరు జిల్లా పోలీసులు.

2024వ సంవత్సరం మార్చి నెలలో పెదనందిపాడు గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న 85 సంవత్సరాల వృద్ధ మహిళపై తెల్లవారు జామున సుమారు 3:00 గంటల సమయంలో ఆమె నివాసం ఉంటున్న పూరి గుడిసెలోనికి అదే గ్రామానికి చెందిన పాలపర్తి మంజు, తండ్రి నాగరాజు, వయస్సు 21 సం.రాలు అనే అతను అక్రమంగా ప్రవేశించి...

ఆమెపై దాడి చేసి ఆమెను బలాత్కారం చేయబోగా నిందితుడిని గట్టిగా నెట్టి పెద్దగా కేకలు వేయగా నిందితుడు అక్కడ నుండి తప్పించుకుని పారిపోయినాడు.

అనే బాధితురాలి ఫిర్యాదు మేరకు జరిగిన ఘటనకు సంబంధించి అప్పటి పెదనందిపాడు ఎస్సై రాజ్ కుమార్ అత్యాచార యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

భౌతిక మరియు సాంకేతిక ఆధారాలను "మహిళపై జరిగిన నేరాలను విచారించే గౌరవ 5వ అదనపు న్యాయస్థానం" వారికి సమర్పించగా కేసుని పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి శ్రీమతి కే.నీలిమా గారు నిందితుడిని నేరస్తుడుగా నిర్ధారించి అతనికి 05 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధిచడం జరిగినది.

నిందితుడికి శిక్షపడుటలో తమ వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ పల్లపు.కృష్ణారావు గారిని, 

కేసుకు సంబంధించిన విచారణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన సీఐ నరసింహారావు గారిని, 

ప్రస్తుత పెదనందిపాడు ఎస్సై మధుపవన్, 

కోర్టు కానిస్టేబుల్ షడ్రక్ శ్రీ ఎస్పీ గారు అభినందించినారు.