AP Deputy CM Pawan Kalyan పై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు.. 

AP Deputy CM పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలో కొంతమంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో AP Deputy CM పవన్ కళ్యాణ్‌పై కొంతమంది ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు.

ఉగ్రవాదుల గురించి మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ముస్లిం యువకులు పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేశారు.

పవన్ కళ్యాణ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉగ్రవాదం, ఉగ్రవాదుల గురించి మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని..

ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని.. పవన్ కళ్యాణ్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా ఆధ్వర్యంలో ముస్లిం యువకులు జహీరాబాద్ ఎస్ఐ కాశీనాథ్‌కు ఫిర్యాదు చేశారు.