ఫేస్‌బుక్‌లో పరిచయం.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. కోటి డిమాండ్.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని ఇంటికి లంచ్‌కు పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, యువతి ఫొటోలు, వీడియోలు తీసుకొని కోటి డిమాండ్ చేసిన ఘటన బయటకు వచ్చింది.

హైదరాబాద్ - బంజారాహిల్స్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ ద్వారా మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

ఇద్దరు కొన్నాళ్లు ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం.. అదే ఏడాది ఆగస్టు 15న ఆమెను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన మహేంద్రవర్ధన్.

ఇంటికొచ్చిన ఆమెకు మాటల్లో పెట్టి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ దారుణం అంత ఫొటోలు, వీడియోలు తీసి.. 

మర్నాడు ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ఆమెకు ఆ ఫొటోలు, వీడియోలు చూపించి.. 

తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు.

దీంతో అతడు అడిగిన ఆ మొత్తాన్ని యువతి ఇచ్చింది.కాగా కొన్నాళ్లుగా తనకు రూ.కోటి ఇవ్వాలంటూ బాధితురాలిని మహేంద్రవర్ధన్ డిమాండ్ చేస్తున్నాడు.

తాను అంత ఇచ్చుకోలేనని ఆమె వేడుకున్నా.. ఫొటోలు, వీడియోలు నెట్లో పెడతానంటూ బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిది.