Gulzar Houz Fire Accident: నిర్లక్ష్యపు ప్రభుత్వం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి.
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం గురించి సంచలన విషయాలు బయటపెట్టిన బాధితులు
ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా కుటుంబ సభ్యులను కోల్పోయామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బాధితురాలు.
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు, కాళ్ళు మొక్కినా సరే ఎఫ్ఐఆర్ ఉంటేనే వైద్యం చేస్తాం అని తేల్చి చెప్పారు.
ఉదయం 6:12 గంటలకు సహాయం కోసం అంబులెన్స్, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేస్తే, 6:45 గంటలకు వచ్చినా 8:04 గంటల వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు.
ఫైర్ సిబ్బంది వద్ద కనీసం టార్చ్ లైట్లు లేవు, ఫైర్ ఇంజన్లో నీళ్ళు లేవు, నీళ్ళు ఉన్నా పైపులకు రంధ్రాలు ఉండడంతో ప్రెషర్ రాలేదు.
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆక్సిజన్ మాస్కులు లేకుండా అంబులెన్సులు ఉండడం అంటే వైద్యశాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఘటనా స్థలానికి చేరుకొని లోపలికి వచ్చి కాపాడే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు, స్థానికుల సహాయంతోనే మా కుటుంబ సభ్యులను బయటకు తీసుకువచ్చాము.
ఫైర్ సిబ్బంది కాపాడతారు అనుకుంటే, అయోమయంలో ఉన్న మా వద్దకు వచ్చి టార్చ్ లైట్ అడిగారు, కనీసం డోర్లు, గోడలు ధ్వంసం చేసే పరికరాలు కూడా వారి దగ్గర లేవు.
ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళమని అంబులెన్స్ డ్రైవర్లను వేడుకున్నప్పటికీ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్యం వల్ల బ్రతికి ఉండాల్సిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ఘటనపై విచారణకు ఆరుగురు సభ్యులతో ప్రభుత్వం వేసిన కమిటీ ఇంతవరకు మమ్మల్ని సంప్రదించలేదు.
మా దగ్గర కాల్ లిస్ట్ ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి, ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు.
హైకోర్టు వెంటనే జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి, మా కుటుంబ సభ్యుల చావుకు కారణమైన నిర్లక్ష్యపు ప్రభుత్వం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి –గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద బాధితులు.