India Vs Pakistan: భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు..!

భారత్ మరియు పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు.

దీనితో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.


యురి, కుప్వారా, అఖ్నూర్‌లో కాల్పుల మోత వినిపిస్తుంది.

భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ కాల్పులు ప్రారంభించడంతో భారత సైన్యం కూడా సమర్ధవంతంగా దానిని తిప్పికొట్టింది.


పాక్‌ సైన్యం కాల్పులను తిప్పికొట్టిన భారత సైన్యం నియంత్రణ రేఖ వద్ద సాధారణ పరిస్థితులు తెచ్చే ప్రయత్నం చేస్తుంది.

మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్ డీజీఎంవో తో భారతదేశ డీజీఎంవో చర్చించారు.

పాక్‌ సైన్యం కాల్పులపై భారత్ త్రీవ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాక్ గట్టిసమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేసింది.

దీంతో సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.