MLA Denduluru: 50లక్షల 44వేలు
అనారోగ్యంతో బాధపడుతున్న 66మంది బాధితులకు అండగా
50లక్షల 44వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించిన
దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్.
దెందులూరు నియోజక వర్గ పరిధిలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 66మంది బాధితులకు అండగా నిలుస్తూ..
శనివారం ఉదయం దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రూ.50లక్షల 44వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామ సీత, మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు) ఈడుపుగంటి అనిల్, మారడానీ రవి, నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు...