ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొంతమంది యువకులు పాకిస్తాన్ జెండాను జాగ్రత్తగా తీసిపెట్టడం.... తీవ్ర దుమారం రేపుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడి క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా పలువురు యువకులు నడుచుకోవడం చర్చనీయాంశంగా మారింది.
భారతదేశంలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం ఇటీవల తీవ్ర చర్చలకు దారితీసింది.
ఉగ్రదాడులు జరుగుతున్నా, భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నా, కొందరు వ్యక్తులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం...
వారికి అనుకూలంగా ప్రవర్తించడంపై ఆగ్రహాం వ్యక్తమవుతోంది.
ఇలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో చూడా చోటుచేసుకుంది.
నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొందరు యువకులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది.
ఈ ఘటనపై ధర్మ రక్షా దళ్ సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించి, పాకిస్తాన్ జెండాలను రోడ్డుపై పడేసి, వాటిని తొక్కిపడేసి ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు..
పాకిస్తాన్ కు అనుకూలంగా నడుచుకోవడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరిగాయి.
సొంత దేశంలో పాకిస్తాన్ జెండాపై ప్రేమేంటని ప్రశ్నిస్తున్నారు.