ఆపరేషన్ సిందూర్.. తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని.

ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 

భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. 

ఇక, ఆపరేషన్ సిందూర్ పై పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. 


పాకిస్తాన్ జాతినుద్దేశించి ప్రసంగించిన షరీఫ్.. 

తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

భారత్ కు ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు.


మనం వెనక్కి తగ్గుతున్నామని భారత్ అనుకుంటోంది. 

కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.