హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి అని..
పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది అన్నారు.
ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి యావత్ జాతి మద్దతిస్తుంది అని...
క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి అన్నారు.
అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టవద్దు అని...
భారత సైన్యాన్ని కించపరచినా... దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులుపెడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే చాలా మంచిది అని అన్నారు.