RBI: అవినీతి బ్యాంకుల ఖాతాలో ఇండస్‌ఇండ్ బ్యాంక్.
దేశంలోనే అయిదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్న ఇండస్‌ఇండ్ బ్యాంకులో అనేక అకౌంటింగ్ మోసాలు చోటుచేసుకుంటున్నట్టు బయటపెట్టిన ఆర్బీఐ.
విదేశీ లావాదేవీల్లో అవకతవకలు ఉన్నాయని, దాదాపు రూ.2 వేల కోట్ల నష్టం వస్తుందని ఆడిటర్ల నివేదికలో బయటపడడంతో రాజీనామా చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు.
గతంలో ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి దొరికిపోయిన పీఎన్బీ, ఎస్ బ్యాంకు తరహాలోనే ఇండస్‌ఇండ్ బ్యాంకు కూడా అవినీతికి పాల్పడినట్టు తేల్చి చెప్పిన ఆర్బీఐ అధికారులు.
వరుస సంఘటనలతో ప్రైవేటు బ్యాంకులపై ప్రజలకు విశ్వాసం తగ్గుతుందని, ప్రైవేటు బ్యాంకులపై నిరంతర నిఘా ఉండాల్సిందేనని స్పష్టం చేసిన ఆర్బీఐ.
ఇండస్‌ఇండ్ బ్యాంకులో ఇంకా దర్యాప్తు పూర్తి అవ్వలేదని, మరిన్ని అవినీతి కార్యకలాపాలు బయటపడే అవకాశం ఉందని తెలిపిన ఆర్బీఐ అధికారులు.