SGT ల విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
SGT ల ఆన్లైన్ కౌన్సెలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా 9 జూన్ 2025 సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాలను టీచర్లు ముట్టడి చేశారు.
దీనితో పాటు SGT లు ఆన్లైన్ కౌన్సెలింగ్ వల్ల ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని...
తెదేపా ఎమ్మెల్సీలు మరియు ఉపాధ్యాయ సంఘాలు మంత్రి నారా లోకేష్ కు కలిసి విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తితో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయం పై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.