Guntur SP Satish Kumar: రౌడీషీటర్లకు కులాలను ఆపాదించవద్దు.
సాధారణ వార్షిక తనిఖీల్లో భాగంగా గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కార్యాలయాన్ని శ్రీ ఎస్పీ సతీష్ కుమార్ గారు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ..
రానున్న రోజుల్లో గుంటూరు జిల్లాలో రౌడీషీటర్లు కనిపించకుండా చేస్తామని ఎస్పీ సతీశ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే పలువురు పై రౌడీషీట్లు ఏర్పాటు చేశాం అన్నారు.
తెనాలి యువకుల పై పోలీసులు దాడి
చేసిన ఘటన పై ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారితో విచారణకు ఆదేశించాం అని..
తెనాలి ఘటన పై ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, రాజకీయ నేతలు చేసిన ఆరోపణలకు త్వరలోనే ముగింపు ఇస్తాము అన్నారు.
రౌడీ షీటర్లు ఎవరైనా కాని ఒకటి, రెండు కేసుల్లో ఉంటే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం అని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లను క్లీన్ స్వీప్ చేశాం అన్నారు.
జిల్లాలో 167 మంది రౌడీషీటర్లు ఉన్నారు.
వారి పై ప్రత్యేక నిఘా పెట్టాము.
అందులో ఆరుగురు పై పీడీయాక్ట్ పెట్టాం అని తెలిపారు.
రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తు, కఠినంగా వ్యవహరిస్తు రౌడీషీటర్లను నియంత్రణ చేస్తున్నాము అన్నారు.
ఎవరైనా కానీ రౌడీషీటర్లకు కులాలను ఆపాదించవద్దు అన్నారు.
చట్టం ముందు ఎవరైనా సమానులే అని, ఎంతటి వారిపైన చర్యలు తప్పవు అని తెలిపారు.