Pocso Case Filed On Lady Teacher: మహిళా టీచర్‌పై పోక్సో కేసు నమోదు.

11వ తరగతి విద్యార్థిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులు.. మహిళా టీచర్‌పై పోక్సో కేసు నమోదు.

ముంబైలోని ప్రముఖ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళా టీచర్.

2023లో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గ్రూప్ డ్యాన్స్ కోసం సిద్ధం చేస్తున్న సమయంలో బాధిత విద్యార్థితో పరిచయం పెంచుకున్న మహిళా టీచర్.

ఆ తర్వాత టీచర్లు-విద్యార్థుల మధ్య ఇలాంటివి సహజమేనని ఆమె చెప్పి బాలుడిని పలు ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకెళ్లిన మహిళా టీచర్.

అలాగే బాలుడికి మద్యం కూడా తాగించి.. బాలుడు తీవ్ర ఆందోళనకు గురైతే, ఆందోళన తగ్గేందుకు మందులు ఇచ్చిన మహిళా టీచర్.

కుమారుడి ప్రవర్తనలో మార్పును గమనించి ఆరా తీయగా, అసలు విషయం తెలిసి ఖంగుతిన్న తల్లిదండ్రులు.

త్వరలోనే తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తవుతుందని.. ఆ తర్వాత ఆ టీచర్ కలిసే వీలుండదని, విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయని తల్లిదండ్రులు.

బోర్డు ఎగ్జామ్స్ తర్వాత విద్యార్థి పాఠశాల నుంచి బయటకు వచ్చినా.. ఆ టీచర్ అతడిని కలిసేందుకు మళ్లీ ప్రయత్నించడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు.

మహిళా టీచర్‌ను అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.