Narendra Modi: జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

జాతీయ జెండాను ఆవిష్కరించారు భారతదేశ ప్రధాని మోదీ. 

భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.


అంతకుముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు.

కాగా 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా

హైదరాబాద్‌లోని పలు ముఖ్య ప్రాంతాలు త్రివర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నాయి.

గోల్కొండ కోట, సచివాలయం, చారిత్రక రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ఈ దృశ్యాలు ప్రతి పౌరుడిలో దేశభక్తిని నింపుతూ, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునేలా చేస్తున్నాయి.