AP Government Transfers IAS Officers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.

ఈ మేరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న పి. శ్రీనివాసులు ను మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. 

ప్రస్తుతం మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణ ను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేసింది.

పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పన కుమారి

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్ ను నియమించారు.

అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజ బాధ్యతలు చేపట్టనున్నారు.

అలాగే చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్,

గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్. ఎస్. శోబిక,

కడప జేసీగా నిధి మీనా ను నియమించారు.

విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి,

అన్నమయ్య జేసీగా శివ్ నారాయణ్ శర్మ,

పల్నాడు జేసీగా వి. సంజనా సింహ బాధ్యతలు స్వీకరించనున్నారు.

కడప జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన నిధి మీనా,

కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషంగా పేర్కొన్నారు.