మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.
చట్టం కంటే తాము ఎక్కువని అధికారులు భావిస్తున్నారు.. వారిని ఎక్కడ నిలబెట్టాలో మాకు తెలుసు.
కోర్టు ఆదేశాలంటే నవ్వులాటలా ఉంది.. కోర్టు పవరెంటో చూపిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు.
వైసీపీ ఆఫీసులు ఆక్యుపెన్సీ ఇవ్వాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు.
హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి.. వైసీపీ ఆఫీసు నిర్మాణ పనులను ఆపాలంటూ నోటీసులు ఇచ్చిన మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్.
కోర్టు ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ ధిక్కరించి, నిర్మాణ పనులను ఆపాలంటూ నోటీసులు ఇచ్చారని తిరిగి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత పేర్ని నాని.
దీనిపై స్పందిస్తూ కమిషనర్‌కు ఇంగ్లీష్ రాదా...? కోర్టు ఉత్తర్వులు అర్ధం కాలేదా...? కోర్టు ఆదేశాలంటే నవ్వులాటలా ఉందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డ హైకోర్టు న్యాయమూర్తి.