❓ Business అంటే ఏమిటి..?
A: Business అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ ఇతరుల సమస్యకు పరిష్కారం ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించే విధానం. సాధారణంగా చెప్పాలంటే –👉 Value ఇవ్వడం👉 దానికి return గా income రావడం.
❓ Business అంటే కేవలం పెద్ద కంపెనీలేనా..?
A: కాదు.చిన్న కిరాణా షాప్, టిఫిన్ సెంటర్, ఫ్రీలాన్సర్, ఆన్‌లైన్ సేవలు – ఇవన్నీ Business కిందే వస్తాయి.
❓ ప్రతి ఒక్కరూ Business చేయగలరా...?
A: అవును.కానీ అందరూ ఒకే విధంగా చేయలేరు. ప్రతి వ్యక్తికి capacity, patience, risk tolerance వేరువేరుగా ఉంటుంది.
❓ Business చేయడానికి చదువు తప్పనిసరా...?
A: కాదు.చదువు సహాయపడుతుంది కానీ అవసరం కాదు. Business లో ఎక్కువగా ఉపయోగపడేది:
నిర్ణయాలు తీసుకోవడం.
కస్టమర్ ని అర్థం చేసుకోవడం.
Discipline.
❓ Business చేయడానికి ఎక్కువ డబ్బు కావాలా?
A: కాదు. డబ్బు కన్నా ముందు కావాల్సింది:
ఒక skill.
ఒక idea.
consistency.
చిన్న పెట్టుబడితో కూడా Business start చేయవచ్చు.
❓ Job చేసే వ్యక్తి Business చేయగలడా..?
A: అవును. చాలామంది part-time గా Business start చేసి, తర్వాత full-time కి మారారు.
❓ Business లో risk తప్పనిసరా..?
A: Risk లేకుండా Business ఉండదు. కానీ knowledge + planning ఉంటే risk control చేయవచ్చు.
❓ Business ఎందుకు చాలా మందికి fail అవుతుంది..?
A: ఎందుకంటే:
Patience లేకపోవడం.
Overnight success ఆశించడం.
Discipline లేకపోవడం.
Learning ఆపేయడం.
❓ Business చేయాలంటే ముఖ్యమైన లక్షణం ఏమిటి..?
A: Consistency. రోజూ చిన్న పని అయినా చేస్తూ ముందుకు వెళ్లడం.
❓ Business లో success రావడానికి ఎంత time పడుతుంది...?
A: ఇది fixed కాదు. కానీ 3–6 నెలలు ప్రయత్నం లేకుండా success ఆశించడం తప్పు.
❓ Business చేయాలనుకునే వాళ్లకు నా సలహా...?
A: Job ని తక్కువ చేయవద్దు. Business ని glamour గా చూడవద్దు. చిన్నగా start చేసి, నేర్చుకుంటూ ముందుకు వెళ్లండి.