IMD Rain Alert: బంగాళఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర అల్ప‌పీడ‌నం క్ర‌మంగా బ‌ల‌ప‌డుతూ రెండు తెలుగు రాష్ట్రాల‌పై ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు.


వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ అల్ప‌పీడ‌నం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి సమయం లోపు శ్రీలంక తీరానికి చేరుకునే అవకాశం ఉంది.

పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్వల్పంగా కనిపించనుంది.

శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ప్రాంతాల్లో వర్ష సూచనలు లేవని,

ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగానే ఉంటుందని తెలిపింది.

ఉదయం వేళల్లో ఒకటి రెండు చోట్ల పొగమంచు కనిపించే అవకాశం ఉందని అన్నారు.

ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.