హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మరో సైబర్ మోసం వెలుగుచూసింది.
ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఓ బాధితుడు ఈ మోసంలో సుమారు రూ.27 లక్షలు కోల్పోయారు.
నిందితులు Facebook, WhatsApp గ్రూపుల ద్వారా ట్రేడింగ్ పేరుతో బాధితుడిని ట్రాప్ చేశారు.
అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.
ఆ యాప్‌లో భారీ లాభాలు చూపిస్తూ నమ్మకం పెంచి దశలవారీగా డబ్బులు వసూలు చేశారు.
తరువాత డబ్బులు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా, ఇంకా డిపాజిట్ చేయాలని నిందితులు డిమాండ్ చేశారు.
అప్పుడే మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు Cyber Crime Police లను ఆశ్రయించారు.
ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.