భూ భారతి రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో భారీగా అక్రమాలు.

ఛార్జీల డబ్బులో కేవలం కొంత శాతం మాత్రమే ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తున్న మీసేవ కేంద్రాలు, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు.

రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ డ్యూటీ ఛార్జీల చెల్లింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు.

జనగామ జిల్లా కేంద్రలో ఒక్క రోజులోనే రూ.8 లక్షల నిధులు ప్రభుత్వ ఖజానాకు రాకుండా పక్కదారి పట్టించిన మీసేవ కేంద్రం నిర్వాహకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఉన్నతాధికారులు.

భూ భారతి ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకునే అవగాహన లేని రైతులను ఆసరగా తీసుకుని, అక్రమాలకు పాల్పడుతున్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉండే స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు.

రిజిస్ట్రేషన్ ఛార్జీల చివరికి ఉండే ఒక సున్నా(0)ను తొలగించి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్న వైనం.

ఉదాహరణకు ఒక వ్యక్తి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి రూ.9,000 చెల్లించగా, చివరిగా ఉన్న సున్నా తొలగించి, కేవలం రూ.900 మాత్రమే ప్రభుత్వ ఖజానాలో జమ చేసిన మీసేవ నిర్వాహకుడు.

ఒక్క జనగామ జిల్లా కేంద్రంలోని ఒక మీసేవ కేంద్రంలోనే, ఒక్క రోజులో రూ.8 లక్షల అవినీతి జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత గండి పడుతుందో అంచనా వేయొచ్చు అంటూ ఉన్నతాధికారుల చర్చలు.