Sankranthi Holidays: ఏపీలో శనివారం నుండి సంక్రాంతి సెలవులు.
ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి.
జనవరి 10 శనివారం 2026 నుండి జనవరి 18 వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
జనవరి 19న (సోమవారం) తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.