మాదినేని మహేష్ హత్య కేసు ఛేదింపు
పుట్టపర్తి పోలీసులు ఐదుగురు నిందితుల అరెస్ట్.
పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మాదినేని మహేష్ (31) హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించినట్లు పుట్టపర్తి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బి. విజయ్ కుమార్ వెల్లడించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పుట్టపర్తి డీఎస్పీ పర్యవేక్షణలో పుట్టపర్తి టౌన్ పోలీసులు వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
08-01-2026 తేదీన మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొత్తచెరువు–పెనుకొండ రోడ్డులోని తలమర్ల క్రాస్ సమీపంలో ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా కారు (AP 02 CC 9009), రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక ఐరన్ పైప్‌తో పాటు మృతుడికి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో, మృతుడు మరియు నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విభేదాలే ఈ హత్యకు కారణమని తేలింది.
01-01-2026 రాత్రి హంద్రీనీవా కాలువ సమీపంలో మృతుడిపై రాయి మరియు ఐరన్ పైప్‌తో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పుట్టపర్తి అర్బన్ ఇన్స్పెక్టర్ ఓ. శివాంజనేయులు, ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.