కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో భాగంగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు.
ఇందుకోసం ఆయన జనవరి 12 ఉదయం దేశ రాజధాని **దిల్లీ**కి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో తమ నాయకుడికి తగిన భద్రత కల్పించాలని **దిల్లీ పోలీస్**లను టీవీకే పార్టీ కోరింది.
గతేడాది సెప్టెంబర్ 27న **కరూర్**లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
ఇప్పటికే ఘటనాస్థలాన్ని పరిశీలించిన దర్యాప్తు అధికారులు పలు కీలక వివరాలు సేకరించారు.
ఈ క్రమంలోనే ఇటీవల విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.