Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు కేంద్రం భారీ ఊరట.

అప్పుల భారంతో కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 

ఇటీవల AGR బకాయిల చెల్లింపుల్లో పాక్షిక మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో 2026 నుంచి 2032 వరకు ఆరేళ్లపాటు ఏటా రూ.124 కోట్లు, ఆ తర్వాత నాలుగు ఏళ్లపాటు ఏటా రూ.100 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. 

మొత్తం రూ.87,695 కోట్ల బకాయిల్లో వచ్చే పదేళ్లలో రూ.1,144 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.